వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తూ, ప్రజల వద్దకు పాలనను తెస్తానని హామీ ఇచ్చారు. మాట తప్పని జగన్ చెప్పినట్టే చేస్తున్నారు. ఇప్పుడు ప్రజాపాలన నడుస్తోంది అని ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి అన్నారు. అయన మాట్లాడుతూ.... బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలను ఒక స్థాయికి తీసుకెళ్లారన్నా, రాజకీయ పదవుల్లో కూర్చోబెట్టారన్నా.. ఆ ఘనత సీఎం జగన్‌మోహన్‌రెడ్డిగారికే దక్కుతుంది. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీ సోదరులను ఛైర్మన్లుగా, డైరెక్టర్లుగా చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిదే. ఎంపీటీసీ, జెడ్పీసీలుగా బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలను నిలబెట్టి గెలిపించారు జగనన్న. ఇక పేదవర్గాల ఆర్థికస్థాయిని పెంచేందుకు ..వారి ఖాతాల్లో నేరుగా డీబీటీ ద్వారా రూ.2.36వేల కోట్లు అందించారు సీఎం జగన్. విద్యా, వైద్యరంగాల్లో విప్లవాత్మక మార్పులతో అట్టడుగువర్గాలు, అణచివేయబడ్డ వర్గాలకు గొప్ప మేలు చేశారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. ఈ రోజు ఆయా వర్గాల పిల్లలు గర్వంగా సర్కారు బళ్లకు వెళుతున్నారన్నా, కార్పొరేట్ స్కూళ్ల స్థాయిలో చదువుతున్నారన్నా అది జగన్ ఘనతే. అలాగే ఎలాంటి జబ్బు వచ్చినా భయపడకుండా, కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందేలా చేశారు జగన్. ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పాలన ప్రజల పాలన,సుపరిపాలన,పారదర్శక పాలన అని అన్నారు.