శ్రీకాకుళం నుంచి కోటబొమ్మాళి కోర్టుకు తీసుకొచ్చి తిరిగి వెళ్తుండగా రిమాండ్ ఖైదీ శుక్రవారం సాయంత్రం పరారైన ఘటన కలకలం రేపింది. సంతబొమ్మాళి మండలంలో ఓ చోరీ ఘటనలో
నిందితుడైన అదే మండలం నర్సాపురానికి చెందిన రిమాండు ఖైదీ నైనిపాత్రుని ముకుందారెడ్డిని ఇద్దరు ఏఆర్ హెచ్సీలు కోర్టుకు తీసుకొచ్చారు. అనంతరం కోర్టు నుంచి తిరిగి తీసుకెళ్తుండగా కిష్టుపురం కూడలి సమీపంలో పరారయ్యాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.