ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆడవారి కన్నీళ్లు వాసన చూస్తే.. ఎంతటి మగాడికైనా దూకుడు తగ్గిపోతుందట

international |  Suryaa Desk  | Published : Sat, Dec 23, 2023, 11:34 PM

మాట్లాడుతున్నారు. వారి కన్నీళ్ల వాసన పీలిస్తే ఎంత దూకుడుగా ఉండే పురుషుడికైనా కళ్లెం పడిపోతుందని, శాంతస్వభావులుగా మారిపోతారని చెబుతున్నారు. ఆడవారి కన్నీళ్ల వాసన.. మగవారిపై అది చూపించే ప్రభావంపై ఇజ్రాయేల్‌లోని వీజ్‌మాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌కు శాస్త్రవేత్తలు అధ్యయనం చేపట్టారు.


మహిళల కన్నీళ్లలోని రసాయనాలు పురుషుల మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని ఈ పరిశోధనలో వెల్లడయ్యింది. ఇవి మగవాళ్లలో దూకుడు, దుందుడుకు స్వభావాన్ని తగ్గిస్తాయని అంటున్నారు. ఈ పరిశోధన ఫలితాలను ‘ప్లాస్‌ బయాలజీ’ జర్నల్‌ ప్రచురించారు. సాంఘిక కీమో సిగ్నలింగ్ ఈ ప్రక్రియ జంతువులలో సాధారణం అని తెలిసినప్పటికీ.. ఎలుకలలో చేపట్టిన పరిశోధనలో ఆడ ఎలుక కన్నీళ్లను వాసన చూసినప్పుడు మగ ఎలుక దూకుడు నిరోధించబడినట్టు గుర్తించారు. అయితే, ఈ ప్రక్రియ మానవులకు తక్కువగా అర్థం అవుతుందని భావించారు.


ఈ పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు ఇద్దరు వ్యక్తుల గేమ్‌ను ఆడేటప్పుడు స్త్రీల భావోద్వేగ కన్నీళ్లు లేదా సెలైన్‌కు గురిచేశారు. మోసం చేస్తున్నారని నమ్మించడం, అవకాశం ఇచ్చినప్పుడు డబ్బును కోల్పోయేలా చేసి ఇతర ఆటగాడిపై ప్రతీకారం తీర్చుకునేలా వీరి ప్రోత్సహించారు. ఇదే సమయంలో మహిళల కన్నీళ్ల వాసనను పసిగట్టిన తర్వాత పురుషులలో ప్రతీకార దూకుడు ప్రవర్తన 40 శాతానికి పైగా తగ్గిందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ సమయంలో ఎంఆర్ఐ‌ను ఉపయోగించి మగవారి మెదడు కార్యకలాపాలను కూడా అధ్యయనం చేశారు. రెచ్చగొట్టేలా ఆడుతున్నప్పుడు మెదడులోని దూకుడు కేంద్రాలైన ప్రిఫ్రంటల్ కార్టెక్స్, అంటేరియర్ ఇన్సులా మరింత చురుకుగా మారాయి. అయితే, మహిళ కన్నీళ్లను వాసన చూసినప్పుడు ఈ కేంద్రాలు అంత చురుకుగా మారలేదని బృందం కనుగొంది. ‘వ్యక్తిగతంగా మెదడు చర్యలో ఎక్కువ వ్యత్యాసం ఉంటే, ఆట సమయంలో ఆటగాడు ప్రతీకారం తీర్చుకోవడం తక్కువగా కనిపిస్తుంది.. కన్నీళ్లు, మెదడు కార్యకలాపాలు, దూకుడు ప్రవర్తన మధ్య సంబంధాలకు సంబంధించి సామాజిక కెమో-సిగ్నలింగ్ ప్రక్రియ జంతువులలో మాత్రమే కాకుండా మానవుడి దూకుడుకు కారకం అని సూచిస్తున్నాయి’ అని పరిశోధకులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com