కడపలో రెండో రోజు ఆదివారం సిఎం జగన్ పర్యటించనున్నారు. ఇడుపులపాయ గెస్ట్‌హౌస్ నుంచి బయలుదేరి వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులర్పిస్తారు. ఆ తర్వాత ప్రేయర్ హాల్‌లో జరిగే ప్రార్థనల్లో పాల్గొంటారు.
మధ్యాహ్నం సింహాద్రిపురం చేరుకుని పలు ప్రారంభోత్సవాలు చేస్తారు. అక్కడ నుంచి ఇడుపులపాయ చేరుకుని ఎకో పార్కులో పులివెందుల మండల ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. రాత్రికి అక్కడి గెస్ట్‌హౌస్‌లో బసచేయనున్నారు.