కాలిఫోర్నియాలోని స్వామి నారాయణ్ ఆలయంపై జరిగిన దాడిని అమెరికా విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ఒక ప్రకటనను విడుదల చేసింది.
నేవార్క్లోని స్వామినారాయణ్ ఆలయ గోడలు, సైన్ బోర్డులపై ఖలిస్తానీ కార్యకర్తలు భారత్, ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలను రాశారు. దీనిని ఆలయ ప్రతినిధి భార్గవ్ రావల్ గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. దాడి ఉద్దేశపూర్వకంగా జరిగిందని నేవార్క్ పోలీసులు తెలిపారు.