కేరళ సీఎం పినరయి విజయన్ భద్రతా సిబ్బందిలో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎల్డిఎఫ్ ప్రభుత్వం చేపట్టిన ‘నవ కేరళ సదస్ యాత్ర’కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలు తెలుపుతున్నారు.
ఈ క్రమంలో సీఎం గన్మెన్ అనిల్, సెక్యూరిటీ అధికారి సందీప్ తమపై దాడి చేశారని కాంగ్రెస్ కార్యకర్తలు ఇద్దరు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.