వేపాడ మండలంలో పలువురు వాలంటీర్లు విధులను బహిష్కరిస్తున్నట్లు బుధవారం తెలిపారు. కనీస వేతనం రూ. 18 వేలు, సచివాలయ సిబ్బందిని రెగ్యులర్ చేసినట్లు వాలంటీర్లను ఔట్సోర్స్ కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఎంపీడీవో పట్నాయక్ కు సమ్మె నోటీస్ ఇచ్చామన్నారు. 27, 28 న కలెక్టరేట్ వద్ద సమ్మెలో పాల్గొంటున్నామని, 29 నుండి ఏపీ వాలంటీర్లు యూనియన్ తరపున నిరవధిక సమ్మె చేపడతామన్నారు.