ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని అన్ని చోట్లా పండుగ వాతావరణంలో నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు. బుధవారం ఆయన జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, వైద్య ఆరోగ్య అధికారులు, ఇతర ఉన్నతాధికారులతో ఆడుదాం ఆంధ్ర, జగనన్న ఆరోగ్య సురక్ష రెండవ దశ కార్యక్రమాలపై టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు.