ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జనసేన నేత నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ సమక్షంలో వంశీ ఈరోజు జనసేనలో జాయిన్ అయ్యారని తెలిపారు. సమాజానికి ఉపయోగపడే విధంగా కింది స్థాయి నుంచి ఎమ్మెల్సీ స్థాయికి వంశీకృష్ణ ఎదిగారన్నారు. మూడు నెలల నుంచి స్థానిక సమస్యలు, ప్రజా సమస్యలపై స్పందించలేకపోతున్నామనే ఆవేదన ఉందన్నారు. పవన్ కళ్యాణ్‌తో కలిసి పని చేయాలనే నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. జనసేనలో చేరేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారన్నారు. విశాఖలో వైసీపీ కోసం వంశీకృష్ణ అహర్నిశలు పని చేశారని.. ఏడు సార్లు నగర అధ్యక్షుడిగా ఉన్న వంశీకృష్ణ జనసేనలోకి రావడాన్ని స్వాగతిస్తున్నామని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa