సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం చిత్రంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఆర్జీవీ తరుఫున నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పులు ఉన్నాయన్నారు. అసలు నారా లోకేష్ వేసిన రిట్ పిటిషన్ పరిగణలోకి రాదన్నారు. సెంట్రల్ సెన్సార్ బోర్డు కమిటి ఉంటుందని.. ఒకవేళ వాళ్ళు అబ్జెక్షన్ చేయాలన్నారు. కానీ నిపుణులు కమిటి ఎలాంటి అడ్డు చెప్పకుండా సెన్సార్ బోర్డు వ్యూహం చిత్రానికి సర్టిఫికెట్ ఇచ్చిందని నిరంజన్ రెడ్డి తెలిపారు. వ్యక్తులను, పార్టీలను కించపరిచే విధంగా ఉంటే సివిల్ కోర్టులో వారు పరువు నష్ట దావా వేసుకోవాలన్నారు. హైకోర్టులో వెయ్యడం కరెక్ట్ కాదన్నారు. వ్యూహం చిత్రం డాక్యుమెంటరీ చిత్రం కాదని.. కళాకారులకు స్వేచ్చ ఉంటుందని నిరంజన్ రెడ్డి తెలిపారు. న్యాయస్థానాలు ఎక్కడ కూడా ఇలాంటి కేసుల్లో జోక్యం చేసుకోలేదన్నారు. గతంలో తెలంగాణ హైకోర్టు సైతం ఇచ్చిన తీర్పులే ఉన్నాయన్నారు. వ్యక్తులను, వ్యవస్థ లను కించపరిచే విధంగా ఉంటే సివిల్ సూట్ వేసుకోవచ్చన్నారు. సుప్రీంకోర్టు చెప్పిన విధంగా ఇక్కడ పిటిషన్ వేసే అర్హత లేదని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.