వైసీపీ చేపట్టిన సామజిక సాధికార యాత్రలో భాగంగా ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.... మనపిల్లలు ఈరోజు సంతోషంగా బదులకు వెళుతున్నారంటే, ఇంగ్లీషు మీడియం చదువులు చదువుతున్నారంటే..ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తేవడమే కారణం. చదువే పిల్లలు తలరాతలు మారుస్తుందని గట్టిగా నమ్మిన ముఖ్యమంత్రి..ఆ దిశలో వేస్తున్న అడుగులు మామూలివి కావు. మన బడుగు,బలహీన వర్గాల తరతరాల తలరాతలు మార్చడానికే మన కోసం వచ్చిన దార్శనికత నేత జగన్‌మోహన్‌రెడ్డి.ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసిన ముఖ్యమంత్రుల్లో ఏ ఒక్కరూ చేయని విధంగా బడుగు,బలహీనవర్గాలు, మైనార్టీ వర్గాలకు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత జగనన్నదే. చంద్రబాబు గోతిలో పడ్డవాడి చందం. బాబు గారు పైకి లేచే అవకాశమే లేదు. అందుకే..ఇప్పుడు నేను పైకి లేస్తే మనిషిని కాదంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడు.నన్ను జైల్లో వేసి నానా ఇబ్బందులు పెట్టారు చంద్రబాబు హయాంలో. నాలాంటి వారిని జైల్లో వేసినవాడు చంద్రబాబు అయితే, ఏకంగా ఎంపీని చేసి పార్లమెంటుకు పంపించిన గొప్ప నాయకుడు జగనన్న. మీరంతా ఒక్కసారి ఆలోచించండి. ఆయనను గెలిపించుకుంటేనే మన బతుకులు, మన పిల్లల భవిష్యత్తులు బాగుంటాయి.చంద్రబాబు హయాంలో మోసపోని వ్యక్తి అంటూ ఎవరూ లేరు అని అన్నారు.