వైసీపీ చేపట్టిన సామజిక సాధికార యాత్రలో భాగంగా డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా మాట్లాడుతూ..... సామాజిక సాధికారత అంటే ఒక నినాదంగానే వింటూ వచ్చాం. కానీ మన రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ పార్టీ అధికారంలోకి రాగానే, ముఖ్యమంత్రి జగనన్న సామాజిక సాధికారత ఒక విధానం అని సాధించి చూపారు. ఈ రాష్ట్రంలో 70 నుంచి 80 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన గొప్ప నాయకుడు మన జగనన్న. వెనుకబాటుకు గురయిన మన బడుగు, బలహీన వర్గాలను నవరత్నాల పేరిట సంక్షేమ పథకాలతో ఆర్థికంగానూ బలోపేతం చేశారు ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి.ఈరోజు కేబినెట్‌లో 17మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారు మంత్రులుగా ఉన్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రుల్లో నలుగురు ఆయా వర్గాలవారే ఉన్నారు. గతంలో మైనార్టీలు తమ సమస్యలు చెప్పుకోవడానికి ఎవరూ లేరు. మైనార్టీల్లో ఒక్కరూ మంత్రిగా లేరు. చంద్రబాబుగారి ఘనత అది. ఆయనకు బీసీలన్నా, ఎస్సీలన్నా, ఎస్టీలన్నా, మైనార్టీలన్నా చిన్నచూపు, అలుసు. అందుకే 2019 ఎన్నికల్లో ఆయన్ను ప్రజలు చావుదెబ్బ కొట్టారు. 2024లోనూ అదే చెయ్యాలి మనం. ఇచ్చిన హామీల్లో వందశాతం అమలు చేయాలని ముందుకు పోతున్న ప్రభుత్వం మన ప్రభుత్వం. జగనన్న ప్రభుత్వం.ఈరోజున నా ఎస్సీలు, ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలంటూ ..మనలందర్ని అక్కున చేర్చుకున్న మన నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి. ఆయన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవడం మనకు అవసరం. మన జీవితాలు బాగుపడాలంటే జగనన్న మళ్లీ రావాలి. సిద్ధాంతాలంటూ ఏవీ లేని పార్టీలన్నీ కలిసి, జగనన్నను ముఖ్యమంత్రి పదవి నుంచి దించాలని ఆశపడుతున్నాయి. ప్రజానాయకుడిని ఓడించడం వారి వల్ల కాదు. వారిని మనం ఓడించాలి. జగనన్న వెంట కోట్లాదిగా ప్రజలు కదులుతున్నారు. జగనన్న అందించిన సంక్షేమ పథకాలు అన్నీ ఇన్నీ కావు. అవన్నీ ఎలా మరవగలరు ప్రజలు?మనం జగనన్నను గెలిపించాలి. మనకోసం..రాష్ట్ర భవిష్యత్తుకోసం మళ్లీ జగనన్నే రావాలి. జగనన్నే కావాలి. టీడీపీ, దాని తోక పార్టీలు పెత్తందారీ పార్టీలు. మన వైఎస్సార్‌సీపీ పేదల పార్టీ. పేదల పార్టీనే గెలవాలి. జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావాలి. మన బడుగు,బలహీన, మైనార్టీ వర్గాలకు ఎంతో మేలు చేసిన ముఖ్యమంత్రి జగనన్నను గుండెల్లో పెట్టుకుందాం అని పిలుపునిచ్చారు.