రాజస్థాన్లోని దౌసా జిల్లాలో శనివారం దారుణం చోటు చేసుకుంది. లాల్సోట్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబ సభ్యులు 20 మందికి పైగా దుండగులు కారులో వచ్చి దాడి చేశారు.
ఈ ఘటనలో ఓ వృద్ధురాలు (70) మరణించగా.. మరో నలుగురు గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రధాన నిందితుడు హిమాన్షు శర్మను అదుపులోకి తీసుకున్నారు. భూ వివాదమే కారణమని పోలీసులు చెబుతున్నారు.