రాష్ట్రంలో వైసీపీని టచ్ చేసే దమ్ము మరే పార్టీకి లేదని సాధికార యాత్రకు వస్తున్న జనాన్ని చూస్తుంటే తెలుస్తుందని అరకు ఎంపీ గొట్టేట మాధవి అన్నారు. ఆమె మాట్లాడుతూ... పొత్తులు పెట్టుకుని టీడీపీ, జనసేన గుంపులు గుంపులుగా వస్తుంటే, జగన్ అన్న ఒక్కరే పోటీకి దిగుతున్నందున రాష్ట్రమంతటా కూడా ఎగిరేది వైసీపీ జెండానే అని ధీమా వ్యక్తం చేసారు. పిల్లల భవిష్యత్తు కోసం నిత్యం ఆలోచించే ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనని, గిరిజనులతో పాటుగా అందరి పిల్లలు ఉన్నత చదవులు చదువుకోడానికి పాడేరులో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసారని, సాలూరులో గిరిజిన యూనివర్శిటీ, గిరిజన ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ దే నని ఉద్ఘాటించారు. గిరిజనుల జీవితాల్లో వెలుగు చూసేందుకు జగన్ నిరంతరం పరి తపిస్తున్నారని, ఆదివాసీల పట్ల ప్రేమ, అప్యాయత చూపే నేత తెలుగుదేశం పార్టీలో ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో గిరిజన శాఖకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదని, జగన్ తన హయాంలో డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి ఆత్మగౌరవాన్ని నిలిపారన్నారు.