అయోధ్యలో నిర్మితమవుతున్న రామాలయానికి గుజరాత్‌లోని వడోదరకు చెందిన బిహాభాయ్ భర్వాద్ అనే రామభక్తుడు 108 అడుగుల భారీ అగరుబత్తిని కానుకగా ఇవ్వబోతున్నారు. 3.5 అడుగుల వెడల్పు, 108 అడుగుల పొడవుతో భారీ అగరుబత్తిని తయారు చేశారు.
ఈ అగరుబత్తి నెలన్నర(45 రోజులు) వరకు వెలుగుతుంది. ప్రొటోకాల్ ప్రకారం సుమారు 3,500 గ్రాముల బరువున్న ఈ ధూపదీపాన్ని రోడ్డు మార్గంలో రథంలో తీసుకుని జనవరి 1న ఉదయం 10 గంటలకు వడోదర నుంచి అయోధ్యకు బయలుదేరుతారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa