గుడిలో దేవుడి దర్శనం అయ్యాక పూజారి నెత్తి మీద శఠగోపం పెట్టి పంపిస్తాడు. అలా ఎందుకు చేస్తారనేది చాలా మందికి తెలిసి ఉండదు. శఠగోపంను వెండి, రాగి, కంచు వంటి లోహాలతో తయారు చేస్తారు. దీనిపై విష్ణువు పాదాలుంటాయి.
తలపై శఠగోపం పెట్టినప్పుడు భక్తులు తమ కోరికలను భగవంతుడికి తెలుపాలట. శఠగోపం తలపై పెట్టినప్పుడు శరీరంలో విద్యుదావేశం జరిగి, మనలోని అధిక విద్యుత్ బయటకెళ్తుంది. తద్వారా ఆందోళన, ఆవేశం తగ్గుతాయి.