కరోనా బాధితుల్లో నరాల సంబంధిత వ్యాధులు వస్తున్నట్లు ఓ పరిశోధనలో వెల్లడైంది. బాధితులు ఒత్తిడి, ఆందోళనతో పాటు ఇతర మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లు డెన్మార్క్ కు చెందిన కొపెన్ హెగెన్ వర్సిటీ పరిశోధకులు గుర్తించారు.
కరోనా బారిన పడిన దీర్ఘకాలిక బాధితుల్లో మెదడు పనితీరులో తేడా ఉందని తెలిపారు. వారిలో డిప్రెషన్ లక్షణాలు పెరుగుతున్నట్లు వెల్లడైందన్నారు.