శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర పట్టణంలో ఐసిడిఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు సోమవారం నిరసన చేపట్టారు. సందర్భంగా అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీదేవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీల కార్యకర్తల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలిపారు.