తమిళనాడు రాష్ట్రంలో ఆరేళ్లలో పిచ్చికుక్క కాటుకు 44 లక్షల మంది గురైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. రేబిస్ వ్యాధి టీకాల ద్వారా నిరోధించగలిగే జినోటిక్ వైరస్ అని, ఇది అత్యంత ప్రమాదకరమైన వ్యాధి అని, ప్రపంచస్థాయిలో 150 దేశాల్లో 59వేల మంది మరణించారని తెలిపారు.
అందులో మూడు వంతుల్లో ఒక భాగం భారతదేశంలో ఉన్నాయన్నారు. 2030 నాటికి రేబిస్ రహిత తమిళనాడుగా మార్చేందుకు చర్యలు చేడతామని అధికారులు తెలిపారు.