పొత్తుల కంటే ప్రజాసమస్యల పరిష్కారమే మాకు ముఖ్యమని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర నిర్వహణ సందర్భంగా ఆయన మాట్లాడారు.
"కేంద్రం ఇచ్చే పథకాలకు వైసీపీ ప్రభుత్వం తన స్టిక్కర్లు వేసుకొని పరిపాలన చేస్తోంది. అన్ని రంగాల్లోనూ సీఎం జగన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది." అని సత్యకుమార్ విమర్శించారు.