శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఓ హోటల్లో బుధవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హోటల్ నిర్వాహకులు మంగళవారం రాత్రి బంద్ చేసి ఇంటికి వెళ్ళారు. అయితే హఠాత్తుగా మంటలు వ్యాపించి హోటల్ లోని వంట సామాగ్రి, ఫర్నిచర్ దగ్ధం అయ్యాయి. కౌన్సిలర్ తయూబ్ పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకొని మంటలు ఆర్పారు.