ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్ తో బుధవారం( నేడు )పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ తెలిపారు. ఒకటవ తేదీ జీతాలు చెల్లించడంతో పాటు పెండింగ్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం 10: 00 నుంచి సత్య సాయి జిల్లా కేంద్రంలో కార్యక్రమం మొదలవుతుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.