విజయవాడ వేదికగా బుధవారం నిర్వహించిన ఏపీ బీజేపీ పదాధికారుల సమావేశం ముగిసింది. జనసేన పార్టీని మిత్రపక్షంగా పేర్కొనడం సహా మొత్తం 11 అంశాలపై
ఈ సమావేశంలో తీర్మానం చేశారు. కాగా, ఈ భేటీలో టీడీపీతో పొత్తు విషయంపై నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. టీడీపీతో పొత్తు నిర్ణయాన్ని పార్టీ హై కమాండ్కే వదిలేసినట్లు బీజేపీ నేతలు వెల్లడించారు.