కర్ణాటకలో దారుణం జరిగింది. సుగంధ మోరే అనే అంగన్వాడీ కార్యకర్త తన పిల్లలతో కలిసి బెలగావిలో నివసిస్తోంది. ఆమె పిల్లలు పక్కనే ఉన్న కల్యాణి మోరే అనే వ్యక్తి ఇంట్లో పూలు కోశారు. దీంతో కోపోద్రిక్తుడైన అతను..
సుగంధతో గొడవ పడి, అనంతరం ఇంట్లోనుంచి కత్తి తీసుకొచ్చి ఆమె ముక్కు కోసేశాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.