వివిధ సంక్షేమపథకాలకు సంబంధించి ఏ కారణం చేతనైనా లబ్ది అందని అర్హులకు.. లబ్ది చేకూర్చే కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఆగష్టు, 2023 నుంచి డిసెంబరు, 2023 వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి మిస్ అయిన 68,990 మంది అర్హులకు, రూ.97.76 కోట్లను సీఎం క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన నేతన్న మురుగుడు నాగరాజు స్వయంగా నేసిన మంగళగిరి పట్టుచీరను అభిమానంతో క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్‌కు బహుకరించాడు. ఈ చీరను శ్రీమతి వైయస్. భారతి గారికి అందించాలని సీఎం వైయస్ జగన్‌ను నాగరాజు కోరాడు.