సీఎం జగన్ ఇస్తున్న సంక్షేమ పధకాలు పొందుతున్న వారిలో భాగంగా , నాకు రెండేళ్ళుగా వాహనమిత్రా సాయం అందింది, కానీ ఈ ఏడాది రాలేదు కారణం అడిగితే కరెంట్ మీటర్ డబుల్ గా ఉండటం వల్ల రాలేదన్నారు, మాకు మీ ద్వారా అన్ని పథకాలు అందుతున్నాయి, మా ఆటో కార్మికులు కూడా సంతోషంగా ఉన్నారు, మా అమ్మకు కూడా పెంచిన ఫించన్ రూ. 3 వేలు అందుతుంది, మీరు చల్లగా ఉండాలి అని పాణ్యం నియోజకవర్గం, కల్లూరు, ఖాజా హుస్సేన్ అనే లబ్ధిదారుడు సంతోషం వ్యక్తపరిచారు.