ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ నెట్‌వర్క్‌ను ఇటీవల చైనా దేశంలో ఆవిష్కరించారు. ఈ నెట్వర్క్‌లో సెకనుకు 1.2 టెరా బైట్స్ (1,200 గిగాబిట్స్) వేగంతో డేటా ట్రాన్స్‌మిట్ అవుతుంది.
టిసింగ్-హువా విశ్వవిద్యాలయం, హువాయీ, సెర్నెట్ డాట్ కామ్ కార్పొరేషన్‌లతో కలిసి చైనా దేశ ప్రభుత్వ మొబైల్ కంపెనీ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసింది.