2003లో నాటి తమిళనాడు సీఎం జయలలిత ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించారు. సమ్మె చేస్తున్నలక్షా 70వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు.
డీఏ తొలగించడం, కొన్ని పెన్షన్ ప్రయోజనాలను రద్దు చేయడంతో నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అదే ఏడాది జులై 1న 13 లక్షల మంది సమ్మెకు దిగారు. వారిపై నాలుగు రోజుల్లోనే ఎస్మా ప్రయోగించారు. హింసకు పాల్పడ్డారని 2వేల మందిని విధుల్లోకి తీసుకోలేదు. సుదీర్ఘ పోరాటం తర్వాత వారు విధుల్లోకి చేరారు.