రాజకీయ పార్టీలు కుల సంఘాలను విభజించి, వాటిని బలహీనపరిచే కుట్రలు చేస్తున్నాయని వీటిని సత్వరం మానుకోకుంటే తగిన బుద్ధి చెబుతామని, ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకరరావు హెచ్చరించారు.
తెనాలిలో సంఘ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ. పార్టీలతో సంబంధం లేకుండా బీసీ సంక్షేమం సంఘం ఏర్పడి, బీసీల సమస్యలను, వారికి జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ ముందుకు సాగుతుందన్నారు.