రైతులు ధాన్యానికి గిట్టుబాటు ధర వచ్చే వరకు ధాన్యాన్ని గిడ్డంగుల్లో నిల్వ చేసుకో వచ్చని బాపట్ల వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యదర్శి కే. నిర్మలా దేవి కోరారు.
శనివారం అమే కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 4 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గిడ్డంగులు అందుబాటులో ఉన్నాయన్నారు. పంట భద్రంగా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు. రైతు బంధు పథకం ద్వారా 6 నెలల వరకు వడ్డీ లేని ఋణ సౌకర్యం ఉందన్నారు.