ప్రస్తుత ప్రపంచంలో ప్రతీ ఒక్కరు సెల్‌ఫోన్‌కు అతుక్కుపోతున్నారు. ఊహ తెలిసిన పసి పిల్లల నుంచి పండు ముసలి వరకు చేతిలో ఫోన్ ఉండాల్సిందే. అయితే పక్కపక్కనే ఉన్నా మాట్లాడుకోకుండా సెల్‌ఫోన్లలోనే చాటింగ్ చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. అవసరాల కోసం ఉపయోగపడాల్సిన సెల్‌ఫోన్.. మన సమయం మొత్తాన్ని లాగేసుకుంటోంది. స్కూలుకు వెళ్లే పిల్లలు ఆన్‌లైన్ చదువుల కోసం ఫోన్ పట్టుకుంటుంటే.. వృద్ధులు కూడా తమ తమ అవసరాల కోసం సెల్‌ఫోన్‌లోనే మునిగిపోతున్నారు. కొంత మంది తాము ఎంత ప్రయత్నించినా ఈ ఫోన్ మత్తు నుంచి బయటికి రావడం లేదని సెల్‌ఫోన్ డీ అడిక్షన్ సెంటర్ల బాట పడుతున్నారు. అయితే ఓ మహిళ మాత్రం సెల్‌ఫోన్‌కు బానిసలైన తన కుటుంబ సభ్యులను బయటికి వచ్చేలా చేశారు.
అయితే ఒడిశాకు మంజూ గుప్తా అనే మహిళ తన కుటుంబాన్ని మొబైల్ అడిక్షన్ నుంచి బయట పడేసింది. అందుకోసం ఆమె చేసిన ప్రయత్నం చూస్తే షాక్ అవ్వాల్సిందే. కుటుంబానికి పెద్ద అయిన మంజూ గుప్తా.. ఈ సమస్య పరిష్కారానికి ఓ వినూత్నమైన పరిష్కారాన్ని తీసుకువచ్చింది. ఇందుకోసం కొన్ని షరతులతో ఒక అఫిడవిట్‌ను తయారు చేసింది. అయితే ఆ కుటుంబ సభ్యులు సమయానుకూలంగా మొబైల్ ఫోన్‌లు వినియోగించేలా ఆ అఫిడవిట్‌లో నిబంధనలు పెట్టింది. అంతే కాకుండా ఆ కుటుంబ సభ్యులతో ఆ అఫిడవిట్‌పై సంతకం చేయించింది.
అయితే అందులో మరిన్ని నిబంధనలు కూడా మంజూ గుప్తా పెట్టింది. ఉదయం నిద్ర లేవగానే ఆ కుటుంబంలోని ఎవరు కూడా ఫోన్‌ని ముట్టుకోకూడదని.. లేవగానే ముందుగా సూర్య నమస్కారాలు చేయాలని తెలిపింది. అందరూ కలిసి డైనింగ్ టేబుల్ వద్ద మాత్రమే తినాలని.. అంతే కాకుండా భోజనం చేసేటప్పుడు ఫోన్ 20 అడుగుల దూరంలో ఉంచాలని షరతు పెట్టింది. ఇంకా ఎవరూ టాయిలెట్‌లోకి ఫోన్‌ను తీసుకెళ్లకూడదని నిబంధన పెట్టింది. రీల్స్ చూడటానికి బదులు టాయిలెట్‌పై దృష్టి పెట్టేందుకే ఈ షరతు పెట్టినట్లు మంజూ గుప్తా వెల్లడించింది.
అయితే ఈ విషయాన్ని మంజూ గుప్తా ట్విటర్‌లో వెల్లడించింది. ఆ అఫిడవిట్‌ను కూడా పోస్ట్ చేసింది. అయితే ఈ నిర్ణయం కూడా తాను కోపంలో తీసుకుంది కాదని తెలిపింది. ఓ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అనన్య పాండే నటించిన ‘ఖో గయే హమ్ కహాన్’ చూసిన తర్వాత తన పిల్లలు ‘లైక్స్’ కోసం పిచ్చోళ్లైన సంగతిని గ్రహించినట్లు మంజు గుప్తా పేర్కొంది. ఈ 3 నిబంధనలు మాత్రమే కాదు.. చివర్లో ఆమె తన పిల్లలకు ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. ఒకవేళ ఎవరైనా పైన తెలిపిన 3 నిబంధనలు పాటించకపోతే.. స్విగ్గీ, జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసే అవకాశం ఉండదనే హెచ్చరిక చేసింది. ప్రస్తుతం మంజూ గుప్తా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆ అఫిడవిట్ వైరల్‌గా మారుతోంది.