రా.. కదలి రా.. కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఈనెల 10న బొబ్బిలి వస్తున్నారని, ఈ పర్యటనను నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని పార్టీ గజపతినగరం నియోజకవర్గ ఇన్‌చార్జి కేఏ నాయుడు పిలుపునిచ్చారు. ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.... వైసీపీ అరాచక పాలనకు ప్రతిఒక్కరూ స్వస్తి పలకాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు పెద్దింటి మోహన్, క్లస్టర్ ఇన్‌చార్జిలు బెజవాడ బంగారునాయుడు, పెద్దంటి జగన్, మజ్జి మహేష్, పార్లమెంట్ కార్యదర్శి గుసిడి జగన్నాథం, చెల్లూరి సత్యరావు, కువైట్ రాము, పి.కేశవరావు, రామసత్యం, తాడ్డి రవి, మంత్రి చంటి, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa