భారత్ వేదికగా మరో కీలకమైన అంతర్జాతీయ సమావేశం ఖరారైంది. తొలిసారిగా యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ సెషన్‌కు భారత్ ఈ ఏడాది అధ్యక్షత వహించడంతో పాటు ఆతిథ్యం కూడా ఇవ్వనుంది.
జూలై 21 నుంచి 31 వరకు న్యూఢిల్లీ వేదికగా ఈ సెషన్ జరగనుంది. ఈ మేరకు యునెస్కోకు భారత శాశ్వత ప్రతినిధిగా వ్యవహరిస్తున్న విశాల్ శర్మ ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. తొలిసారిగా యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీకి భారత్ ఆతిథ్యం ఇస్తోంది.