గంగా నదికి ఉపనది అయిన సరయు నది ఉత్తరాఖండ్‌లో పుట్టి అయోధ్యని ఆనుకుని ప్రవహిస్తుంది. అయితే ఈ నది శాపగ్రస్తమైందని అందరికీ తెలీదు.
విష్ణువు అవతారమైన శ్రీ రాముడు తన అవతారం చాలించే సమయంలో ఈ నదిలోనే జల సమాధి అయ్యి తన జీవితానికి ముగింపు పలికాడు. దీని కారణంగా మహా శివుడు సరయు నదిపై ఆగ్రహం తెచ్చుకున్నాడు. ఆ సమయంలో శివుడు సరయు నదిలో మునిగితే పాపాలు మాత్రమే పోతాయని, పుణ్యఫలం మాత్రం లభించదని శపించాడు.