సాంకేతిక లోపం కారణంగా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంను కోల్కతా విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. కోల్కతా-భువనేశ్వర్- బెంగళూరు వెళ్తున్న విమానం సోమవారం సాయంత్రం టేకాఫ్ అయ్యింది.
అరగంట తర్వాత విమానం గాల్లో ఉండగా ఏదో శబ్ధం వచ్చినట్లు ప్రయాణికులు తెలిపారు. దీంతో పైలట్ అత్యవసర ల్యాండింగ్ కోసం ఎయిర్ కంట్రోల్ అధికారులను కోరారు. వారి అనుమతితో కోల్కతా ఎయిర్పోర్ట్లో విమానాన్ని ల్యాండ్ చేశారు.