సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి జనరంజక పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జరిగిన మేలును వివరించేందుకు వైయస్ఆర్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర మంగళవారం గుంతకల్లులో జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు పట్టణంలోని మెయిన్ రోడ్డు వైయస్ఆర్ సర్కిల్‌లో సభ జరగనుంది. ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. సభాస్థలితో పాటు ప్రధాన రహదారులన్నీ వైయస్ఆర్‌సీపీ జెండాలు, ఫ్లెక్సీలతో కళకళలాడుతున్నాయి. వైయస్ జగన్ పాలనలో బడుగు, బలహీనవర్గాలకు చేకూరిన ప్రయోజనాలను వివరించి, వారిలో చైతన్యం తీసుకురావాలన్న లక్ష్యంతో బస్సు యాత్ర సాగుతోంది. ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి కె.వి.ఉషశ్రీచరణ్, మాజీ మంత్రులు శంకరనారాయణ, అనిల్‌కుమార్ యాదవ్, ఎంపీలు రంగయ్య, నందిగం సురేష్‌తో పాటు ఇతర ప్రజాప్రతినిధులతో పాటు సినీనటుడు, ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ హాజరు కానున్నారు.