తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఒకే ఫేజ్‌లో.. ఒకే డేట్‌లో ఎన్నికలు నిర్వహించాలని వైయస్‌ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు. రెండు రాష్ట్రాలకు ఒకే తేదీన ఎన్నికలు పెడితే డూప్లికెట్ ఓటర్లు ఓటు వేయానికి అవకాశం ఉండదన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్, కమిషనర్లు అనూప్‌చంద్ర పాండే, అరుణ్ గోయల్‌తో కూడిన ఉన్నతాధికారుల బృందం విజయవాడకు చేరుకుంది. మంగళవారం వైయస్ఆర్‌సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మార్గాని భరత్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఆరు అంశాలపై ఫిర్యాదు చేశారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. గుర్తింపులేని పార్టీ జనసేనను ఎలా అనుమతించాలరని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. జనసేనకు ఉన్న గ్లాస్ గుర్తు జనరల్‌గా సింబల్‌గా గుర్తించడం చట్టవిరుద్ధమని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. సీఈసీ అధికారులకు ఆరు అంశాలపై నివేదిక ఇచ్చామన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సీఈవో బల్క్ కంప్లెట్స్‌ను యాక్సెప్ట్ చేయడం సరికాదని తప్పుపట్టారు. ఎన్ని ఓట్లు నిజమైనవని జిల్లా కలెక్టర్లు విచారణ చేయించి నివేదిక ఇచ్చారన్నారు.