మంగళవారం సాయంత్రం అహ్మదాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ రోడ్‌షో నిర్వహించారు. రోడ్‌షోకు ముందు, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న యూఏఈ అధ్యక్షుడికి ప్రధాని మోదీ స్వాగతం పలికారు. కారులో కూర్చున్న నేతలిద్దరూ రోడ్డుకు ఇరువైపులా పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలకు అభివాదం చేశారు.15 నిమిషాలపాటు సాగిన రోడ్‌షో విమానాశ్రయం నుంచి ప్రారంభమై మూడు కిలోమీటర్ల దూరంలోని ఇందిరా వంతెన వద్ద ముగిసింది.బుధవారం గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్ కన్వెన్షన్ సెంటర్‌లో వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ (VGGS) 10వ ఎడిషన్‌ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు, ఇక్కడ UAE అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరవుతారు.