వార్డు సచివాలయం స్థాయిలో నిర్వహించాల్సిన పలు కార్యక్రమాలపై నగర కమిషనర్ అరుణ మంగళవారం వార్డు కార్యదర్శులు, సీవోలు, ఆర్పీలతో వీడియో సమావేశం ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఆడుదాం ఆంధ్ర, జగనన్న ఆరోగ్య సురక్ష-2, జన్ భాగీదారి కార్యక్రమాల నిర్వహణపై వార్డు కార్యదర్శులకు మార్గనిర్దేశం చేశారు. కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జన్ భాగీదారి కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు.