భూవివాదాల నేపథ్యంలో ప్రత్యర్థులు ఓ వ్యక్తిని అతి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన కడప జిల్లాలోని ఓబులవారిపల్లి మండల కేంద్రంలో మర్రిమాను వద్ద జరిగింది. గత కొంతకాలంగా కటికం చెంగడు అతని ప్రత్యర్థుల మధ్య భూ వివాదం నడుస్తోంది. భూ వివాదంలో ఘర్షణతో అతన్ని కొందరు దుండగులు దారుణంగా నరికి చంపేశారు. విచక్షణారహితంగా కత్తులతో కటికం చెంగడుపై దాడిచేయడంతో ఘటనా స్థలంలో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ హత్యపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చెంగడు మృతిపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.