ఉపాధి దొరక్క అప్పుల పాలై చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చేనేత జన సమాఖ్య గురువారం పేర్కొంది. వేటపాలెం మండలం కొణిజేటి చేనేతపురిలో లేళ్ల విజయలక్ష్మి అనే చేనేత కార్మికురాలు అప్పుల బాధతో ఈ నెల 9వ తేదీన ఆత్మహత్య చేసుకుందన్నారు. గత ఏడాది జూలైలో దేశాయిపేట లో ముగ్గురు చేనేత కార్మికులు బలవన్మరణం చెందారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి చేనేతలను ఆదుకోవాలని సమాఖ్య డిమాండ్ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa