టీడీపీ అధినేత చంద్రబాబు రేపు ( శనివారం ) సీఐడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇసుక, మద్యం కేసుల్లో పూచీకత్తు సమర్పించనున్నారు. ఇప్పటికే చంద్రబాబుకు హైకోర్టు ఈ మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ ఇచ్చింది. వారం రోజుల్లో దర్యాప్తు అధికారి ఎదుట హాజరై పూచీకత్తు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. కాగా.. చంద్రబాబుపై ఉన్న మూడు కేసులపై విచారణ జరిగిన సందర్భంలో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఒకేసారి మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అలాగే మద్యం కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, విశ్రాంత ఐఏఎస్ అధికారి శ్రీ నరేష్‌కు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.