నంద్యాల జిల్లా శ్రీశైలం ఆలయం ప్రాంగణంలో భారీ నాగుపాము ప్రత్యక్షమైంది. అమావాస్యకు తోడు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండటంతో భారీ నాగుపాము కనిపించడంతో భక్తులు ఆశ్చర్యపోయారు. పాము ఆలయ ప్రాంగణంలోని శ్రీస్వామివారి గర్భాలయ పై భాగంలో శ్రీస్వామి అమ్మవారి కళ్యాణ మండంపలో భక్తులు తిరిగే ప్రదేశంలో కనిపించింది. నాగుపామును చూసిన భక్తులు మల్లన్న మహిమ అంటూ చర్చించుకున్నారు. వెంటనే ఆలయ సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. వాళ్లు స్నేక్ క్యాచర్ కాళీ చరణ్‌ను పిలిపించారు. చరణ్ బొరియలో దూరిన పామును చాకచక్యంగా ఓ సంచిలోకి వెళ్లేలా చేశారు.. దానిని పట్టుకుని బయటకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలేయడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. నేటి నుంచి మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు సమీస్తున్న సమయంలో నాగుపాము భక్తులకు కనపడటంతో భక్తులు ఆసక్తిగా చూశారు. గతంలో కూడా శ్రీశైలం ఆలయ ప్రాంగణంలో పాములు కనిపించాయి. అయితే ఆలయానికి ఓ స్నేక్ క్యాచర్ ఉంటే బావుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.