భారత టెస్టు ఆటగాడు గాదె హనుమ విహారి ఆంధ్ర రంజీ జట్టు సారథ్యం వదులుకున్నాడు. బ్యాటింగ్‌పై పూర్తిస్థాయిలో దృష్టిసారించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాడు. శుక్రవారం ముంబయితో ప్రారంభమైన రంజీ ట్రోఫీ ఎలీట్ గ్రూపు-బి మ్యాచ్‌లో సీనియర్ బ్యాటర్ రిక్కీ భుయ్ ఆంధ్ర సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ముంబయి తొలి రోజు ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 281 పరుగులు సాధించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa