భారతీ య సనాతన ధర్మం విశ్వ వ్యాప్తమని శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద సరస్వతిస్వామిజీ పేర్కొన్నారు. ధర్మమంటే ఒక మతంకాదని గు ర్తించాలన్నారు. ఈదరపల్లిలో సేవాభారతి, రా ష్ట్రీయ స్వయం సేవక్‌సంఘ్ ఆధ్వర్యంలో నిర్మిం చిన జనహిత కార్యాలయం అదనపు భవనాన్ని శనివారం ఆర్‌ఎస్‌ఎస్ అఖితభారత కార్యకారణి సదస్యులు వారణాసి రాంమాధవ్‌తో కలిసి స్వామిజీ ప్రారంభించారు. సేవాభారతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం లో భాగంగా తొలుత ముఖ్యఅతిథులకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామిజీ గోపూజ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో ముఖ్యవక్తగా సహక్షేత్ర ప్రచారక్ భరత్‌కుమార్ హాజరై ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమా లను వివరించారు. ముఖ్య అతిథులు రాంమాధవ్ మాట్లాడుతూ అయోధ్యలో ఈనెల 22న రామ మందిరంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠతో భారతీయుల్లో స్థిరప్రతిష్ఠ జరుగుతుందన్నారు. పరిపూ ర్ణానంద సరస్వతిస్వామి మాట్లాడుతూ సేవా భారతి, ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రమైన అమలాపురంలో జనహిత కార్యాలయాన్ని నిర్మించడం అద్భుతమన్నారు. మెట్రోకెమ్ అధినేత నందెపు వెంకటేశ్వర రావు (బాలాజీ) తనవంతుగా ఆర్థిక సాయాన్ని ప్రకటించి జనహిత ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాల ను ప్రశంసించారు. ఆర్‌ఎస్‌ఎస్ విభాగ్ సంపర్క్ బులుసు జగదీష్, రాష్ట్ర అధ్యక్షుడు సుంకవిల్లి రామకృష్ణ, ఆర్‌ఎస్‌ఎస్ రాష్ట్ర, విభాగ్ ప్రము ఖులు డాక్టర్ గోదశి గంగరాజు, శ్రీరామచంద్రరాజు, ఓలేటి సత్యనారాయణ, సోమశేఖర్, జీవీఎస్ కామేశ్వరరావు, వాసంశెట్టి బలరా మకృష్ణ, అమ్మిరాజుతోపాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాళ్ల దొరబాబు పాల్గొన్నారు.