తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాన్ ఆదివారం ఉదయం రాజధాని ప్రాంతం మందడంలో జరిగే భోగిమంటల వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాలుగున్నర ఏళ్లగా జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల జీవో కాపీలను భోగి మంటల్లో దహనం చేశారు. కాగా మూడు రోజులపాటు ‘రా కదలిరా’ కార్యక్రమానికి టీడీపీ, జనసేన పార్టీలు పిలుపు నిచ్చాయి. గుంటూరు జిల్లాలోని టీడీపీ కార్యాలయం వద్ద తెలుగు యువత ఆధ్వర్యంలో బోగి మంటల వేడుకలు జరిగాయి. ‘కీడు తొలగాలి... ఏపీ వెలగాలి’ పేరుతో బోగి మంటలు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ పాలనలో ఇచ్చిన జీవో ప్రతులను బోగి మంటల్లో దగ్దం చేశారు. అలాగే వైసీపీ మ్యానిఫెస్టో పేపర్లను టీడీపీ నేతలు తగలబెట్టారు.