గన్నవరం ఎయిర్‌పోర్ట్ చుట్టూ గంటపాటు విమానాలు గాల్లో చక్కర్లు కొట్టడం తీవ్ర ఆందోళన కలిగించింది. చెన్నై, బెంగళూరు నుంచి వచ్చిన విమానాలు గన్నవరం ఎయిర్‌పోర్టులో దిగాల్సి ఉండగా.. అవి గంటపాటు గాల్లోనే తిరిగాయి. దీంతో ఆ రెండు విమానాల్లో ఉన్న వారే కాకుండా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎట్టకేలకు ఆ రెండు విమానాలు సురక్షితంగా గన్నవరం ఎయిర్‌పోర్టులో దిగడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. చివరికి ఆ విమానాల్లోని ప్రయాణికులు తమ తమ గమ్యస్థానాలకు వెళ్లారు.
చెన్నై, బెంగళూరు ఎయిర్‌పోర్టుల నుంచి బయల్దేరిన రెండు ఇండిగో విమానాలు గన్నవరం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే ఆ సమయంలో వాతావరణం అనుకూలించలేదు. పొగమంచు కారణంగా విమానం ల్యాండింగ్‌కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి అనుమతి రాకపోవడంతో ఆ రెండు విమానాలను వాటి పైలట్లు గాల్లోనే చక్కర్లు కొట్టించారు. బెంగళూరు ఇండిగో విమానం గన్నవరం ఎయిర్ పోర్ట్ చుట్టూ చక్కెర్లు కొట్టింది. దీంతోపాటు చెన్నై నుంచి వచ్చిన మరో ఇండిగో విమానం గుడివాడ, ముదినేపల్లి పరిసర ప్రాంతాల్లో గాలిలో చక్కర్లు కొట్టింది. సుమారు గంట పాటు ఆ రెండు విమానాలు గాలిలోనే చక్కర్లు కొట్టాయి.
అయితే చివరకు వాతావరణం అనుకూలించడంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి ల్యాండింగ్‌కు అనుమతి లభించింది. దీంతో ఎట్టకేలకు చెన్నై, బెంగళూరు నుంచి వచ్చిన ఇండిగో విమానాలు గన్నవరం ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. దీంతో ఆ రెండు విమానాల్లో ఉన్న ప్రయాణికులతోపాటు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే వాతావరణం సహకరించకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి నెలకొందని గన్నవరం ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు.