ఈ కొత్త ఏడాది కార్ల తయారీ సంస్థలు ధరలను పెంచనున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మారుతి సుజుకి తన వాహనాల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ముడిపదార్ధాల ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కారణంగా వాహన మోడల్స్ అన్నింటి ధరలను సగటున 0.45 శాతం పెంచింది. ఈ ధరల పెంపు తక్షణం అమల్లోకి వస్తుందని మంగళవారం స్టాక్ ఎక్స్ఛేంజ్లకు ఇచ్చిన సమాచారంలో తెలిపింది.