మన దేశంలో ధనిక రైతులపై పన్ను విధించటం సబబుగానే ఉంటుందని రిజర్వ్‌బ్యాంకు మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సభ్యురాలు అషిమా గోయల్ పేర్కొన్నారు. దేశంలోని పన్నుల విధానంలో న్యాయబద్ధతను తీసుకురావడానికి ధనిక రైతులకు సానుకూల ఆదాయపు పన్ను విధించడాన్ని ప్రభుత్వం ఆలోచించవచ్చని సూచించారు.
ఈ మేరకు బుధవారం ఓ కార్యక్రమంలో ఈ విధంగా స్పందించారు. వచ్చే నెల 1న కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.