ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను శుక్రవారం తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ఖాళీ చేశారు. అయితే, గతేడాది మహువా మొయిత్రా లోక్సభ సభ్యత్వం రద్దు అయిన నేపథ్యంలో..
బంగ్లాను ఖాళీ చేయాలంటూ అధికారులు ఆమెకు పలుమార్లు నోటీసులు జారీ చేశారు. ఆ ఆదేశాల నేపథ్యంలోనే తాజాగా మహువా ప్రభుత్వ బంగ్లాను వీడినట్లు సంబంధిత వర్గాల సమాచారం.